Upcoming Events

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ద్వారా సద్గురు శివానందమూర్తి గారి *నాజీవనయానం ప్రసారం మానవతావాది, తత్వవేత్త సద్గురు శివానంద మూర్తిగారు తమ జీవితం గురించి ధృక్పథాల గురించి ముచ్చటించడంతో బాటు, ఆధునిక భారత దేశానికి సంబంధించిన అనేక విషయాలను ఆకాశవాణిలో ప్రస్తావించారు. ఆ మహా యోగి అంతరంగావిష్కరణను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మే నెల ఒకటవ తేదీ నుంచి 10 భాగాలు ప్రతి రోజూ మధ్యాహ్నం 12.40 ని. లకు ప్రసారం చేస్తుంది ... ఈ కార్యక్రమంలో వారితో మొదటి ఏడు భాగాలలో పాత్రికేయులు శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రి., చివరి మూడు భాగాలలో శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి సంభాషించారు. ముందు మాట AIR DDG శ్రీమతి మల్లాది శైలజా సుమన్ గారిది. ఈకార్యక్రమం ఆకాశవాణి శబ్దభాండాగారం/ఆర్క్వైస్ సౌజన్యంతో ప్రసారమౌతున్నది.